RTI దరఖాస్తుపై అధికారుల నిర్లక్ష్యం మూడు నెలలు గడిచినా సమాచారం ఇవ్వలేదని ఆరోపణ

చిల్లకూరు, సెప్టెంబర్ 4: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో సమాచార హక్కు చట్టం (RTI) కింద దాఖలు చేసిన దరఖాస్తుకు నిర్ణీత గడువులో సమాచారం అందించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆర్. మస్తానయ్య ఆరోపించారు. చిల్లకూరు మండలానికి సంబంధించి 05-06-2026న RTI దరఖాస్తు సమర్పించినట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని వివిధ పంచాయతీల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన వివరాలు, ఆక్రమణలకు సంబంధించి జారీ చేసిన సెక్షన్ 6, సెక్షన్ 7 నోటీసులు, సంబంధిత Assessment Numbers, పేర్లు, చిరునామాలు తదితర సమాచారాన్ని కోరినట్లు...