నాయుడుపేట: మద్యం సేవించి ఆటో నడిపిన కేసులో సూళ్లూరుపేటకు చెందిన ఈ. సందీప్ కుమార్ (25)కు నాయుడుపేట JMFC కోర్టు 7 రోజుల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. సెప్టెంబర్ 1న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అతడిపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది.
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.