sathyavelugu.com
Date of Publish : 24 September 2026, 9:10 pm Posted by : Dr.K.Suresh Editor

సూళ్లూరుపేటలో ఘనంగా జనసేన నేత ఉయ్యాల ప్రవీణ్ జన్మదిన వేడుకలు

సూళ్లూరుపేట: జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ జన్మదిన వేడుకలను సూళ్లూరుపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. హోలీ క్రాస్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బస్టాండ్ ఎదురుగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఉయ్యాల ప్రవీణ్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రవీణ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు శంకు సురేష్, ఆవుల రమణ, నారే భాస్కర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.