ఏపీ పింఛన్లలో కీలక మార్పు.. కేంద్రం వాటా నేరుగా ఖాతాల్లోకి

అమరావతి: ఎన్టీఆర్ భరోసా పింఛన్లలో భాగంగా 2026 అక్టోబర్ 1 నుంచి NSAP కింద కేంద్ర ప్రభుత్వం అందించే పింఛన్ వాటాను లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ వాటా మాత్రం గతంలో మాదిరిగానే ఇంటి వద్ద నగదు రూపంలో పంపిణీ చేయనున్నారు. ఈ మార్పు వల్ల ఏపీలో NSAP పరిధిలోని సుమారు 9.34 లక్షల మంది లబ్ధిదారులు ప్రభావితం కానున్నారు.