కొండూరులో ‘సామాజిక శంఖారావం’ డ్రైనేజీ, రహదారి సమస్యలు పరిష్కరించాలని KVPS డిమాండ్

తడ, సెప్టెంబర్ 7: తిరుపతి జిల్లా తడ మండలం కొండూరు గ్రామంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) సూళ్లూరుపేట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ‘సామాజిక శంఖారావం’ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం రాత్రి 7:30 గంటలకు గ్రామంలో పర్యటించిన కమిటీ సభ్యులు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రధానంగా డ్రైనేజీ, రహదారుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలంలో మురుగునీరు, వర్షపు నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వీధులు గుంతలమయంగా మారి...