నాయుడుపేట, సత్య వెలుగు న్యూస్: నాయుడుపేట పట్టణంలోని ఎల్.ఏ. సాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. తల్లిదండ్రుల సమక్షంలో తిరుపతి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ భరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఎన్నికల్లో ఎస్ఎంసీ చైర్మన్గా నెలవల చంద్రశేఖర్, వైస్ చైర్మన్గా ఓ. స్వర్ణ ఎన్నికయ్యారు. మండల పరిధిలోని 74 పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఎస్ఎంసీ సభ్యులు సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంఓ ఆర్.వి. రమణ, ఎంఈఓ బి. మునిరత్నం, ఎల్.ఏ. సాగరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కట్టిన సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు గడదాసు వెంకటేశ్వర్లు, జి.వి. నాయుడు, కె. రాఘవేంద్ర, కె. సుధాకర్, ఆనంద్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.