నాయుడుపేట : వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మేర్లపాక బ్రదర్స్, తుమ్మూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మట్టి విగ్రహాలు, సహజసిద్ధమైన పుష్పాలు, పత్రులతో పూజలు నిర్వహించడం వల్ల జలవనరులకు కాలుష్యం కలగకుండా ఉంటుందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉన్నందున వాటిని వినియోగించవద్దని సూచించారు.
“మట్టి విగ్రహాలు ముద్దు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు” అనే సందేశంతో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు కూడా మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మేర్లపాక శ్రీనివాసులు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.