హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు ,ఒక్కొక్కరికి రూ.25 వేల జరిమానా

నాయుడుపేట, సెప్టెంబర్ 7 (సత్య వెలుగు): నాయుడుపేట పట్టణ పరిధిలోని విన్నమాల వద్ద 2021లో జరిగిన హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ గూడూరు అదనపు జిల్లా న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం.. 2021 నవంబర్ 17న విన్నమాల వద్ద రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో అరవ శ్రీనివాసులు, శీనయ్యపై ముగ్గురు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై అప్పటి నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...