మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు మధుసూదన్ నాయుడు కౌంటర్ హంద్రీ–నీవా నీరు, సమ్మర్ స్టోరేజ్, అభివృద్ధిపై టీడీపీ నేత విమర్శలు

పుంగనూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):పుంగనూరు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. హంద్రీ–నీవా ద్వారా పుంగనూరు ప్రాంతానికి నీరు రావడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల హంద్రీ–నీవా నీటిని పుంగనూరు, కుప్పం ప్రాంతాల వైపు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. పుంగనూరులో గతంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు సంబంధించిన ఖర్చు, గత...