ఏపీలో డీమార్ట్ తరహాలో “మీ మార్ట్లు”.. అక్టోబర్ 1న ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీమార్ట్ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా “మీ మార్ట్లు” ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలిదశలో మొత్తం 1,000 మీ మార్ట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 1న ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న “మీ మార్ట్లను” అక్టోబర్ 1, 2026న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మార్ట్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని...