చీకట్లో సుబ్బానాయుడు కండ్రిగ గ్రామం వీధి దీపాలు ఏర్పాటు చేయాలని MRPS డిమాండ్

 సత్య వెలుగు న్యూస్,నారాయణవనం: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం సుబ్బానాయుడు కండ్రిగ గ్రామంలోని నక్కన బోయిన అరుంధతివాడలో సుమారు 20 కుటుంబాలు నివసిస్తున్నాయని, కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని MRPS మండల అధికార ప్రతినిధి పునబాకు సాయితేజ మాదిగ తెలిపారు. గ్రామం అడవిని ఆనుకుని ఉండటంతో రాత్రివేళల్లో విషపురుగులు, పాములు సంచరిస్తున్నాయని, గతంలో పాము కాటు ఘటనలు కూడా జరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ గ్రామంలో కనీసం వీధి విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఆందోళనకరమన్నారు. వీధి...