పుత్తూరు, సెప్టెంబర్ 28 — సత్య వెలుగు న్యూస్:
పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం పంచాయతీ దళితవాడ, కూర్మానుకండ్రిగ దళితవాడకు చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేస్తున్న కృషికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.