వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 20 కుటుంబాలు, పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
పుత్తూరు, సెప్టెంబర్ 28 — సత్య వెలుగు న్యూస్: పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం పంచాయతీ దళితవాడ, కూర్మానుకండ్రిగ దళితవాడకు చెందిన 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేస్తున్న కృషికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు....