జాతీయ కాఫీ దినోత్సవం — ఒక కప్పు కాఫీ వెనుక శతాబ్దాల చరిత్ర
కాఫీ కప్పులో చరిత్ర.. సంస్కృతి.. సువాసన.. చైతన్యం! సత్య వెలుగు న్యూస్: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక కప్పు వేడి వేడి కాఫీ కోసం ఎదురుచూసే వారు ఎంతోమంది. అల్పాహారంతో పాటు కాఫీ, అతిథి ఇంటికి వస్తే కాఫీ, స్నేహితులతో సమావేశమైతే కాఫీ.. ఇలా కాఫీ మన దైనందిన జీవితంలో ఒక పానీయం మాత్రమే కాకుండా ఒక జీవనశైలిగా, ఆతిథ్య సంస్కృతిలో భాగంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే కాఫీకి వేల సంవత్సరాల చరిత్ర ఉందని చారిత్రక ఆధారాలు, సంప్రదాయ కథనాలు...