ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యతకు కొత్త ఊపు.. 82.1 శాతానికి పెరుగుదల

అమరావతి, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. 2024లో 72.6 శాతంగా ఉన్న రాష్ట్ర అక్షరాస్యత ప్రస్తుతం 82.1 శాతానికి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో సుమారు 25 లక్షల మంది అక్షరాస్యులుగా మారినట్లు ప్రభుత్వం తెలిపింది. 2027 సెప్టెంబర్‌ నాటికి 100 శాతం లక్ష్యం రాష్ట్రంలో 2027 సెప్టెంబర్‌ నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 25...