sathyavelugu.com
Date of Publish : 24 September 2026, 4:26 pm Posted by : Dr.K.Suresh Editor

ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కొత్త పాలసీ

అమరావతి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు న్యూస్): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి పారితోషికం అందించనున్నారు.

  • కేటగిరీ A: 1 లక్షకు పైగా ఫాలోవర్లు – రూ.15,000 వరకు
  • కేటగిరీ B: 50,000–99,999 – రూ.7,500 వరకు
  • కేటగిరీ C: 25,000–49,999 – రూ.5,000 వరకు
  • కేటగిరీ D: 10,000–24,999 – రూ.2,500 వరకు

అర్హత, కంటెంట్ నిబంధనలు, చెల్లింపుల విధానంపై పూర్తి మార్గదర్శకాలు వెలువడాల్సి ఉంది.