శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతానికి కొత్త రహదారి

వేదం పెద్దమిట్ట కండ్రిగ వరకు 1.04 కి.మీ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం.. రూ.1.05 కోట్ల నిధులు మంజూరు శ్రీకాళహస్తి: పల్లెటూళ్లే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాల అభివృద్ధికి మెరుగైన రహదారి సదుపాయాలు ఎంతో కీలకమని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించే దిశగా మరో ముందడుగు పడింది. శ్రీకాళహస్తి–ముసలిపేడు రోడ్డు నుంచి వేదం పెద్దమిట్ట కండ్రిగ వరకు కొత్తగా గ్రామీణ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 1.04 కిలోమీటర్ల పొడవైన...