sathyavelugu.com
Date of Publish : 11 September 2026, 6:27 pm Posted by : KUMPATI SURESH

తిరుపతిలోనే నైలెట్‌ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయాలి: జెన్‌ జీ

తిరుపతి: నైలెట్‌ (NIELIT)ను తిరుపతి నుంచి అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ జెన్‌ జీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్‌ నుంచి మెయిన్‌ గేట్‌ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, యువత, నగర ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ.. రాయలసీమ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు నైలెట్‌ వంటి సంస్థలు ఎంతో అవసరమన్నారు. తిరుపతిలో సుమారు 15 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైన నేపథ్యంలో సంస్థను అమరావతికి తరలించడం అన్యాయమని అన్నారు.

తిరుపతికి ప్రతిపాదించిన నైలెట్‌తో పాటు ఇతర విద్యా, నైపుణ్య సంస్థలను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.