తిరుపతిలోనే నైలెట్‌ శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయాలి: జెన్‌ జీ

తిరుపతి: నైలెట్‌ (NIELIT)ను తిరుపతి నుంచి అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ జెన్‌ జీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ యూనివర్సిటీ రెండో గేట్‌ నుంచి మెయిన్‌ గేట్‌ వరకు జరిగిన ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, యువత, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ.. రాయలసీమ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు నైలెట్‌ వంటి సంస్థలు ఎంతో అవసరమన్నారు. తిరుపతిలో సుమారు 15 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైన నేపథ్యంలో...