sathyavelugu.com
Date of Publish : 26 September 2026, 8:59 pm Posted by : Dr.K.Suresh Editor

మందబైలు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు

నాయుడుపేట: మందబైలు అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషకాహార మాసోత్సవాలు, అంగన్వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులకు సమతుల్య ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, బాలల సమగ్ర అభివృద్ధిపై అవగాహన కల్పించారు.

స్థానికంగా లభించే పోషకాహార పదార్థాలతో ప్రదర్శన ఏర్పాటు చేసి, చిన్నారులకు ఆటపాటల ద్వారా అభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమలత, మండల బీజేపీ అధ్యక్షులు తొప్పాని బాలకృష్ణ, అంగన్వాడీ కార్యకర్త సుబ్బమ్మ, ఆయా మారమ్మ తదితరులు పాల్గొన్నారు.