అంబేద్కర్‌పై ‘కల్పిత నాయకుడు’ పుస్తకంపై అభ్యంతరం, హమారా ప్రసాద్‌పై నగరి పోలీస్ స్టేషన్‌లో BSP నాయకుల ఫిర్యాదు

నగరి, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు న్యూస్): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’గా పేర్కొంటూ పుస్తకం రాశారని ఆరోపిస్తూ రచయిత హమారా ప్రసాద్‌పై BSP నగరి నియోజకవర్గ కమిటీ నగరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. BSP రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. పుస్తకంలోని అంశాలపై విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో BSP నగరి ఇన్‌చార్జ్, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు Y.P. నాగూర్, నియోజకవర్గ అధ్యక్షులు...