కోటూరు పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు చైర్మన్‌గా పి. ఖాదర్ వలీ, వైస్ చైర్మన్‌గా డి. గీత ఎన్నిక

చౌడేపల్లి, సెప్టెంబర్ 29, సత్య వెలుగు న్యూస్: చౌడేపల్లి మండలం కోటూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం సజావుగా నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి తిరుమలమ్మ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బళ్ళాపురం మురళి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ చంద్రమౌళి, బాల్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పి. ఖాదర్ వలీ చైర్మన్‌గా,...