sathyavelugu.com
Date of Publish : 24 September 2026, 5:27 pm Posted by : Dr.K.Suresh Editor

పంట్రంగం దేవస్థానం భూముల వేలం ప్రశాంతంగా నిర్వహణ, తొలిరోజు 109.17 ఎకరాలకు వేలం.. రూ.33.27 లక్షల ఆదాయం

వాకాడు: మండలంలోని మూలపడవ పంచాయతీ పరిధి పంట్రంగం గ్రామంలోని శ్రీ పాండులింగేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ భూముల వేలం బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 613 ఎకరాల 35 సెంట్ల భూములకు గాను తొలిరోజు 109 ఎకరాల 17 సెంట్లకు వేలం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

ఈ వేలం ద్వారా సుమారు రూ.33.27 లక్షల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఎకరాకు రూ.24,500 నుంచి రూ.25,000 వరకు వేలం పాట నమోదైనట్లు పేర్కొన్నారు.

ధర్మకర్త, పాలకమండలి అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, ఈవో ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాకాడు ఎస్‌ఐ నిఖిల్ బాబు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు.

మిగిలిన 504 ఎకరాల 18 సెంట్ల భూములకు గురువారం రెండో విడత వేలం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.