sathyavelugu.com
Date of Publish : 09 September 2026, 4:04 pm Posted by : KUMPATI SURESH

ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో తిరుపతి జిల్లా క్రీడాకారుల సత్తా

నాయుడుపేట: సత్య వెలుగు న్యూస్:VIT-AP యూనివర్సిటీలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన ఏపీ ఫస్ట్ స్టేట్ లెవెల్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో తిరుపతి జిల్లాకు చెందిన పోలీస్ క్రీడాకారులు ప్రతిభ చాటారు.

అగ్రహారపుపేట, నాయుడుపేటకు చెందిన నాగలాపురం శివకృష్ణ రెజ్లింగ్ ఫ్రీ స్టైల్, గ్రీకు రోమన్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించడంతో పాటు ఆర్మ్ రెజ్లింగ్‌లో పతకం సాధించారు. చిలుకూరు మండలం మర్లమెట్ట గ్రామానికి చెందిన మంగళపూరి శివయ్య ఫ్రీ స్టైల్, గ్రీకు రోమన్ రెజ్లింగ్‌లో రెండు బంగారు పతకాలు, ఆర్మ్ రెజ్లింగ్‌లో వెండి పతకం సాధించారు.

అలాగే జయంపు గ్రామానికి చెందిన చిన్నం చెంగల్ రాయల్ రెండు రెజ్లింగ్ విభాగాల్లో బంగారు పతకాలు, ఆర్మ్ రెజ్లింగ్‌లో పతకం సాధించారు. వీరిలో చెంగల్ రాయల్ ఈ నెల 23 నుంచి 27 వరకు హర్యానాలో జరిగే ఆల్ ఇండియా టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రెజ్లింగ్ జనరల్ సెక్రటరీ, రెజ్లింగ్ కోచ్ బి. ఉదయ్ కుమార్ క్రీడాకారులను అభినందించారు.