విద్యుత్ ఘాతానికి ప్రైవేట్ లైన్ మ్యాన్ మృతి
దొరవారిసత్రం: విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో, పాలెంపాడు గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని దళితవాడలో విద్యుత్ స్తంభంపై సమస్యను సరిచేసేందుకు ఎక్కిన ప్రైవేట్ లైన్మెన్ దొడ్డి గుంటకయ్య (36) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. త్రీ ఫేజ్ స్తంభానికి దళితవాడతో పాటు బీసీ కాలనీ ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరా అవుతుండగా, ఒకవైపు మాత్రమే సరఫరా నిలిపివేసి స్తంభంపైకి ఎక్కడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన సమయంలో సంబంధిత...