అంబేద్కర్‌ పుస్తకంపై చౌడేపల్లిలో నిరసన హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల డిమాండ్

చౌడేపల్లి, సెప్టెంబర్ 18, సత్య వెలుగు న్యూస్: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను అవమానించేలా పుస్తకం రూపొందించారంటూ ఆరోపిస్తూ చౌడేపల్లి మండలంలోని దళిత సంఘాలు, కుల వివక్ష పోరాట సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ పరిపాలన భవనం ఎదుట నిరసన చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హమారా ప్రసాద్ అలియాస్ నాగులరపు వర ప్రసాద్ రచించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకంలోని అంశాలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. పుస్తకంలోని...