రాజనాలబండపై రెండో రోజు అలరించిన రామకోటి
చౌడేపల్లి, సెప్టెంబర్ 26 (సత్య వెలుగు న్యూస్): సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాలబండపై శనివారం రెండో రోజు నిర్వహించిన రామకోటి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మైక్‌సెట్ రమణ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామనామ స్మరణ చేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు భక్తులు రాజనాలబండ వద్ద సత్య ప్రమాణాలు చేయగా, మరికొందరు తమ ప్రమాణాలను వాయిదా వేసుకున్నారు. రామనామ స్మరణతో రాజనాలబండ పరిసరాలు మార్మోగాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి...