sathyavelugu.com
Date of Publish : 17 September 2026, 9:49 pm Posted by : KUMPATI SURESH

పీఎం సూర్య ఘర్ పథకం అమలుపై సమీక్ష

నాయుడుపేట, సెప్టెంబర్ 17: పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన అమలుపై నాయుడుపేట డివిజన్‌లో సోలార్ విక్రయదారులతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పెండింగ్ దరఖాస్తులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, సేవలపై సమీక్షించారు.

అర్హులైన గృహ వినియోగదారులకు పథకం ప్రయోజనాలు త్వరగా అందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని విక్రయదారులకు ఆదేశించారు.