స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి G.O.Ms.No.77 రద్దు చేయాలని ABVP డిమాండ్

  సత్య వెలుగు న్యూస్,నాయుడుపేట: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ABVP ఆధ్వర్యంలో నాయుడుపేట గాంధీ మందిరం వద్ద నిరసన నిర్వహించారు. ABVP ప్రాంత SFD కో-కన్వీనర్ తడుకు చందు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. G.O.Ms.No.77ను రద్దు చేసి PG విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు...