చౌడేపల్లిలో గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి
చౌడేపల్లి, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్): చౌడేపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు ఇక్కలూరి రాజేష్ (42) మృతి చెందారు. చౌడేపల్లి సంత గేటు ప్రాంతానికి చెందిన రాజేష్ ప్రజాశక్తి దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా రాజేష్ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు స్పందించేలోపే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. రాజేష్ మృతితో కుటుంబ...