మండలంలో వరుసగా కేబుల్ దొంగతనాలు

చౌడేపల్లి, సెప్టెంబర్ 28 – సత్య వెలుగు న్యూస్:చౌడేపల్లి మండలంలో బోరుబావుల కేబుల్ వైర్ల దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గడంవారిపల్లి పరిధిలో కేబుల్ దొంగతనానికి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మండలంలోని గడంవారిపల్లి పరిధిలోని బండోని చెరువు వద్ద రైతు నాటేష్‌కు చెందిన బోరుబావి కేబుల్ వైర్లు దొంగతనానికి గురయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బోరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తూ కేబుల్ వైర్లను కట్ చేస్తున్న వ్యక్తిని రైతులు, స్థానికులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని పట్టుకుని...