జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక అధికారులు సెప్టెంబర్ 25 నుంచి కలెక్టర్ల ఆధ్వర్యంలో జడ్పీ పాలన
అమరావతి, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రజా పరిషత్ (ZPP) పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎన్నికైన సభ్యుల పదవీకాలం సెప్టెంబర్ 24, 2026తో ముగియనుంది. దీంతో సెప్టెంబర్ 25 నుంచి ఆయా జిల్లాల కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ సంబంధిత జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆరు...