మోక్ష గణపతి ఆలయంలో విశేష పూజలు, లడ్డూకు భారీ డిమాండ్.. రూ.1,49,116కు వేలం
చౌడేపల్లి, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్):చౌడేపల్లి మండలంలోని పంచాయతీ కేంద్రం శెట్టిపేటలోని మోక్ష గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాత మాదిరాజు లక్ష్మణరాజు, పతిరాజు దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వేద పండితుల ఆధ్వర్యంలో గణనాథుడికి తొలి పూజ నిర్వహించి, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులు చేపట్టారు. అనంతరం ఆలయ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఊరేగించారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని...