కుష్టు కేసుల గుర్తింపుపై ప్రత్యేక నిఘా
పెళ్లకూరు, సెప్టెంబర్ 17:పెళ్లకూరు మండలం చెంబేడు పీహెచ్‌సీ పరిధిలో కుష్టు వ్యాధి నిర్ధారణ, అనుమానిత కేసుల గుర్తింపు కార్యక్రమం చేపట్టారు. తిరుపతి జిల్లా లెప్రసీ అధికారి బాబు నెహ్రూ రెడ్డి పీహెచ్‌సీని సందర్శించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిశీలనను సమీక్షించారు. చర్మంపై స్పర్శజ్ఞానం తగ్గిన మచ్చలు, చర్మంలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటి పరిశీలనతో పాటు ప్రజలకు వ్యాధి లక్షణాలు, చికిత్సపై అవగాహన...