చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, సెప్టెంబర్ 21,సత్య వెలుగు న్యూస్: తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారి దివ్యరూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనసేవ సమయంలో వర్షం కురిసినప్పటికీ భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వర్షం నుంచి ఉత్సవమూర్తులను రక్షించేందుకు ఘటాటోపం ఏర్పాటు చేసి వాహనసేవను కొనసాగించారు. మురళీకృష్ణుడి అలంకారంలో వేణువు ధరించిన శ్రీవారి దివ్యరూపం భక్తులను విశేషంగా...