sathyavelugu.com
Date of Publish : 29 September 2026, 7:53 am Posted by : Dr.K.Suresh Editor

సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం విజయవంతం

సూళ్లూరుపేట, — సత్య వెలుగు న్యూస్:

సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం విజయవంతంగా నిర్వహించారు. సూళ్లూరుపేటలోని శేష సాయి కళ్యాణ మండపంలో గౌరవ శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రగతి నివేదికలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలను ఎమ్మెల్యేకు నివేదించారు.

ప్రజల నుంచి అందుతున్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రజా సంక్షేమం, నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.