సూళ్లూరుపేట నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం విజయవంతం

సూళ్లూరుపేట, — సత్య వెలుగు న్యూస్: సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం విజయవంతంగా నిర్వహించారు. సూళ్లూరుపేటలోని శేష సాయి కళ్యాణ మండపంలో గౌరవ శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రగతి నివేదికలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలను...