చిత్తూరులో ‘స్వచ్ఛభారత్–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం

చిత్తూరు, సెప్టెంబర్ 19: చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛభారత్–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మొక్కలు నాటి, రోడ్లను శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి స్వచ్ఛత ఎంతో అవసరమని అన్నారు. చిత్తూరును ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో చూడ చైర్‌పర్సన్ కఠారి హేమలత, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, అధికారులు, కౌన్సిలర్లు,...