పెళ్లకూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):
ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు పెళ్లకూరు మండలంలో స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ఎంపీడీవో డా. సిహెచ్. వేణయ్య గురువారం ప్రారంభించారు.
ఇళ్లలోని పాత ప్లాస్టిక్ సామగ్రిని స్వచ్ఛ రథానికి అందజేస్తే, వాటి పరిమాణం, రకాన్ని బట్టి నిర్ణయించిన విలువకు అనుగుణంగా వంట సామగ్రిని అందించే విధానం చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు