నిరుపేదల అభ్యున్నతే స్వర్ణభారత్ ట్రస్ట్ లక్ష్యం

వెంకటాచలం: స్వర్ణభారత్ ట్రస్ట్ 25 ఏళ్లుగా నిరుపేదల అభ్యున్నతి, విద్య, సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్కు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆశీస్సులు, దీపా వెంకట్ పట్టుదల, కృషితో స్వర్ణభారత్ ట్రస్ట్...