₹20 వేలతో మహాప్రసాదం లడ్డును దక్కించుకున్న తెల్లమేకల కోటేశ్వరరావు

బెల్లంకొండ: మండల పరిధిలోని బెల్లంకొండ గ్రామంలో స్థానిక గ్రామ దేవతల ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం స్వామివారి చెంత ఉంచిన మహాప్రసాదం లడ్డుకు కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా, గ్రామానికి చెందిన తెల్లమేకల కోటేశ్వరరావు రూ.20,000 వేలం పాట పాడి మహాప్రసాదం లడ్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు...