తారు మిక్సింగ్ ప్లాంట్‌తో కాలుష్యం రోగాల బారిన పడనున్న నెలబల్లి గ్రామ ప్రజలు
దొరవారిసత్రం,సత్య వెలుగు న్యూస్ : దొరవారిసత్రం మండల పరిధిలోని నెలబల్లి గ్రామ ప్రజలకు తారు మిక్సింగ్ ప్లాంట్‌తో వాయు కాలుష్య ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై–కలకత్తా జాతీయ రహదారికి సమీపంలో వాసమ్మ ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి దట్టమైన పొగ వెలువడుతోందని వారు ఆరోపిస్తున్నారు. నెలబల్లి గిరిజన కాలనీ, హరిజనవాడకు సమీపంలోనే ప్లాంట్ ఉండటంతో తారు మిక్సింగ్ సమయంలో వెలువడే పొగ, ధూళి గాలితో గ్రామం వైపు వ్యాపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల ప్రజలకు...