వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి, పే స్కేల్ అమలు చేసి.. అర్హులకు పదోన్నతులు కల్పించాలని వినతి

పెళ్లకూరు, సెప్టెంబర్ 24 (సత్య వెలుగు NEWS):గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పెళ్లకూరు మండల వీఆర్ఏలు తహసీల్దార్ సి.హెచ్. హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకుడు చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో ఈ వినతి సమర్పించారు. ప్రస్తుతం రూ.10,500 వేతనంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని వీఆర్ఏలు తెలిపారు. పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను సెటిల్మెంట్ వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులకు 70 శాతం పదోన్నతులు కల్పించాలని కోరారు. మరణించిన వీఆర్ఏల కుటుంబాల్లో ఒకరికి వయసుతో సంబంధం లేకుండా...