తిరుపతి పవిత్రతను కాపాడాలి తిరుమల ప్రధాన దారుల్లోని మద్యం షాపులు తొలగించాలి – జిల్లా కలెక్టర్కు ఆమ్ ఆద్మీ పార్టీ వినతి
తిరుపతి,సత్య వెలుగు న్యూస్: తిరుపతి నగరంలోని తిరుమల ప్రధాన మార్గాల్లో ఉన్న వైన్ షాపులు, బార్ షాపులను తక్షణమే తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వినతిపత్రం అందజేసిన నాయకులు.. తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారని తెలిపారు. తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి మద్యం దుకాణాలు ఉండటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని...