నందిమంగళం గ్రామానికి రాకపోకల దారి లేక ఇబ్బందులు, హైవే నిర్మాణంతో తీవ్ర అవస్థలు.. అండర్‌పాస్ లేదా యూ-టర్న్ ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి

-నందిమంగళానికి దారి కరువు-హైవే నిర్మాణంతో గ్రామస్తుల అవస్థలు-అండర్‌పాస్ లేదా యూ-టర్న్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి పుత్తూరు,సత్యవెలుగు న్యూస్, సెప్టెంబర్ 20: తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణ పరిధిలో జరుగుతున్న హైవే రోడ్డు నిర్మాణంతో నందిమంగళం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. గ్రామానికి రాకపోకలు సాగించేందుకు సరైన మార్గం లేకపోవడంతో పాటు పలు వైపులా డివైడర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు దూరప్రాంతాల మీదుగా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. హైవే నిర్మాణం కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగులు, పాఠశాలలకు...