ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి

సత్య వెలుగు – హైదరాబాద్ ప్రతినిధి హైదరాబాద్‌ పాతబస్తీని కేవలం ‘ఓల్డ్ సిటీ’గా కాకుండా తెలంగాణకు గర్వకారణమైన ‘ఒరిజినల్ సిటీ’గా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. చంచల్‌గూడ–సంతోష్‌నగర్ మధ్య రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన 3.2 కిలోమీటర్ల స్టీల్ ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ పాతబస్తీ ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మలక్‌పేటలో ఆడబిడ్డల ఉన్నత విద్య కోసం ప్రభుత్వ బాలికల జూనియర్, డిగ్రీ...