sathyavelugu.com
Date of Publish : 15 September 2026, 8:53 pm Posted by : KUMPATI SURESH

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి రోజు , అర్హులైన ప్రతి ఒక్కరూ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీఓ రాజేంద్రబాలాజీ

నాయుడుపేట, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్):
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో నూతన పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) రాజేంద్రబాలాజీ కోరారు.

నూతన పెన్షన్ల నమోదుకు రేపు బుధవారం చివరి రోజుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు. అర్హత కలిగిన వారు గడువు ముగిసేలోగా తమ తమ గ్రామాల సచివాలయాలను సంప్రదించి నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే 609 మంది దరఖాస్తు

నాయుడుపేట మండలంలో ఇప్పటివరకు వివిధ రకాల నూతన పెన్షన్ల కోసం 609 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీఓ రాజేంద్రబాలాజీ వెల్లడించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన వారు వెంటనే స్పందించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

అర్హత పత్రాలతో సచివాలయాలకు వెళ్లాలి

నూతన పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ రేపు బుధవారం లోగా ఆయా గ్రామాల సచివాలయాల్లో అర్హతకు సంబంధించిన పత్రాలను సిబ్బందికి సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, గడువు ముగిసేలోగా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలని రాజేంద్రబాలాజీ కోరారు.