నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి రోజు , అర్హులైన ప్రతి ఒక్కరూ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి: ఎంపీడీఓ రాజేంద్రబాలాజీ
నాయుడుపేట, సెప్టెంబర్ 15 (సత్య వెలుగు న్యూస్):తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో నూతన పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) రాజేంద్రబాలాజీ కోరారు. నూతన పెన్షన్ల నమోదుకు రేపు బుధవారం చివరి రోజుగా ప్రభుత్వం ప్రకటించిందని ఆయన తెలిపారు. అర్హత కలిగిన వారు గడువు ముగిసేలోగా తమ తమ గ్రామాల సచివాలయాలను సంప్రదించి నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 609 మంది దరఖాస్తు నాయుడుపేట మండలంలో ఇప్పటివరకు...