వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ప్రజా సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకుని, వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో వైఎస్సార్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తుచేశారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం తీసుకుని వ్యవసాయ రంగానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు...