చౌడేపల్లిలో విషాదం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చౌడేపల్లి, సెప్టెంబర్ 19: చౌడేపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చౌడేపల్లి–పలమనేరు ప్రధాన రహదారిలోని చిట్టిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చౌడేపల్లి పట్టణంలోని కుమ్మరవీధికి చెందిన మహేష్ (26), చౌడేపల్లి మండలం గోసలకురపల్లికి చెందిన సంతోష్ (22) అక్కడికక్కడే మృతి చెందారు. అదే ప్రమాదంలో చౌడేపల్లిలోని ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేంద్ర, గోసలకురపల్లికి చెందిన చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...